ప్రతీరోజూ నంద్యాలలోని నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అదిచాలదన్నట్లుగా ఈనెల 22వ తేదీన మళ్ళీ నంద్యాలకు వస్తున్నారు. ఉపఎన్నిక ఖాయమైనప్పటి నుండి ఓటర్లకు రకరకాల తాయాలాలు పంచుతున్నారు.

నంద్యాల ఉపఎన్నికపై చంద్రబాబునాయుడు ప్రత్యేకదృష్టి పెట్టారు. మంత్రులు, ఎంఎల్ఏ, ఎంఎల్సీలకు బాధ్యతలు అప్పటించటమే కాకుండా ప్రతీరోజూ నంద్యాలలోని నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అదిచాలదన్నట్లుగా ఈనెల 22వ తేదీన మళ్ళీ నంద్యాలకు వస్తున్నారు. ఉపఎన్నిక ఖాయమైనప్పటి నుండి ఓటర్లకు రకరకాల తాయాలాలు పంచుతున్నారు. ఇళ్ళ స్ధాలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు మొదలుపెట్టారు. కాపు, బిసి కార్పొరేషన్ల ఆధ్వర్యంలో వివిధ సామాజిక వర్గాల్లో పట్టుందనుకున్న నేతల్లో కొందరికి క్యాబులు, ట్రాక్టర్లు తదితరాలను అందచేస్తున్నారు. 

సరే, రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పించటం తదితరాలు ఎటూ ఉంటాయిలేండి. ఇవన్నీ చాలవన్నట్లు 22వ తేదీన ఏర్పాటుచేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటంలో భాగంగా పేదవారికి రేషన్ కార్డులు, పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత బహిరంగసభలో కూడా పాల్గొంటున్నట్లు మంత్రి అఖిలప్రియ చెప్పారు. నంద్యాలో రోడ్లు విస్తరణకు భారీగా స్పందన లభించిందిన్నారు. త్వరలోనే 13వేల ఇండ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టనున్నట్లు కూడా అఖిలప్రియ చెప్పారు.