చంద్రబాబు వేదికమీద మాట్లాడుతుండగా పలువురు నేతలు ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి మాట్లాడుకుంటున్నారు. దాంతో చంద్రబాబు చిర్రెత్తుకొచ్చింది.
మహానాడు వేదికపై నుండే పలువురు నేతలకు చంద్రబాబునాయుడు చురకలు వేసారు. నేతల్లో డిసిప్లిన్ పోతోందని వాపోయారు. మహానాడు చివరిరోజైన సోమవారం చంద్రబాబు వేదికమీద మాట్లాడుతుండగా పలువురు నేతలు ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి మాట్లాడుకుంటున్నారు. దాంతో చంద్రబాబు చిర్రెత్తుకొచ్చింది. కార్యకర్తలు క్రమశిక్షణతో కూర్చున్నా నేతల్లో క్రమశిక్షణ కొరవడిందన్నారు. సమస్యంతా నేతలతోనే అంటూ వాతలుపెట్టారు.
వేదికమీద తాను మాట్లాడుతున్నపుడు కాసేపు కూడా వినే ఓపికి నేతల్లో లేకపోవటం దురదృష్టకరన్నారు. ఏదైనా విషయం తెలుసుకుందామని, గ్రూపు డిస్కషన్లలో పాల్గొని నాలెడ్జి పెంచుకుందామన్న తపన నేతల్లో ఎక్కడా కనిపించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. నేతలు మాట్లాడుకోవాలంటే అందుకు వేరే సమయం ఉందని అప్పుడు మాట్లాడుకోవాలని హితబోధచేసారు. దాంతో అప్పటి వరకూ తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్న నేతలు కాసేపు తమ నోళ్ళకు తాళాలు వేసారు.
