‘‘ప్రతిపక్ష నాయకుడు తన ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని, 2004లో ఆయన కలిగి ఉన్న ఆస్తులపై గరిష్టంగా 20 శాతం అదనంగా ఉంచుకుని మిగితావాటిని ఇచ్చేయాలి’’.....‘‘అలా చేయటం వల్ల ఒకేసారి సమస్యలన్నీ పరిష్కారమైపోతాయి’’ చంద్రబాబు చెప్పింది బాగానే ఉందికానీ ఇక్కడే ఓ చిన్న విషయాన్ని మరచిపోయినట్లున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఒక్క కేసు కుడా ఇంత వరకూ నిరూపితం కాలేదు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని నిరూపితం కాకుండానే జగన్ మోసానికి పాల్పడి ఆస్తులు సంపాదించాడని చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారు.

‘‘ప్రతిపక్ష నాయకుడు తన ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని, 2004లో ఆయన కలిగి ఉన్న ఆస్తులపై గరిష్టంగా 20 శాతం అదనంగా ఉంచుకుని మిగితావాటిని ఇచ్చేయాలి’’.....‘‘అలా చేయటం వల్ల ఒకేసారి సమస్యలన్నీ పరిష్కారమైపోతాయి’’...వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. మోసానికి పాల్పడిన అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్, కేశవరెడ్డి తదితర సంస్ధల గురించి మాట్లాడుతూ చంద్రబాబు పై వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు చెప్పింది బాగానే ఉందికానీ ఇక్కడే ఓ చిన్న విషయాన్ని మరచిపోయినట్లున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఒక్క కేసు కుడా ఇంత వరకూ నిరూపితం కాలేదు.

అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని నిరూపితం కాకుండానే జగన్ మోసానికి పాల్పడి ఆస్తులు సంపాదించాడని చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారు. ఇక, అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్, కేశవరెడ్డి ఆస్తుల్లాగ జగన్ కు చెందిన ఆస్తులేవీ ప్రభుత్వ ఆధీనంలో లేవు కదా? పైగా పై సంస్ధలకు లాగ జగన్ కుడా తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించాలని ఓ ఉచిత సలహా పడేసారు. పై సంస్ధలేవీ తమ ఆస్తులను వాటంతట అవి ప్రభుత్వానికి అప్పగించలేదు. కోర్టు ఆదేశాల ప్రకారమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జగన్ ఆస్తుల విషయంలో కుడా ప్రభుత్వం అదే పని చేయవచ్చు కదా ఎవరొద్దన్నారు?

ఇక, చంద్రబాబు విషయానికి వస్తే, ఆయపైన కుడా అనేక అక్రమాస్తుల ఆరోపణలున్నది నిజం కాదా? చాలా కేసులు కోర్టులో విచారణకు నోచుకోకుండా స్టేలపై దశాబ్దాలపాటు మగ్గుతున్న విషయం వాస్తవమే కదా? 1974కి ముందున్న ఆస్తులను ఉంచుకుని మిగితాది ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే నిప్పు చంద్రబాబు అంగీకరిస్తారా? మోసాలు చేసారని, అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని కోర్టుల్లో తేలిన తర్వాత కుడా తాము నిర్దోషులమనే అంటున్నారు. అటువంటిది ఒక్క కేసు కుడా కోర్టులో రుజువుకాకుండానే, పైగా విచారణ జరుగుతుండగానే మోసాలకు పాల్పడి జగన్ ఆస్తులు సంపాదించారని చంద్రబాబు ఎలా ముద్రవేస్తారు?