తెలంగాణాలో తలసాని శ్రీనివాసయాదవ్ కు మంత్రి పదవి ఇచ్చినపుడు తాను విమర్శించానని ఒప్పుకున్నారు. అయితే, అప్పటి పరిస్ధితులు వేరు, ఇప్పటి పరిస్ధితులు వేరట. అంటే ఫిరాయింపులు తప్పుకాదన్నట్లే మాట్లాడుతున్నారు. ఈ రెండేళ్ళల్లోనే పరిస్ధితుల్లో ఏం మార్పు వచ్చిందో  నిప్పు చంద్రాబాబే చెప్పాలి.

మొత్తానికి ఇంటా, బయట హోరెత్తుతున్న విమర్శలపై చంద్రబాబునాయుడు నోరు విప్పక తప్పలేదు. ఫిరాయింపులకు మంత్రిపదవులపై పార్టీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చంద్రబాబు వైఖరిపై పెద్ద దుమారమే రేగుతోంది. ఆ విషయంపైనే చంద్రబాబు స్పందించారు. అయితే, ఫిరాయింపులకు మంత్రి పదవులను ఇవ్వటాన్ని అడ్డుగోలుగా సమర్ధించుకుంటూ మాట్లాడటం విచిత్రం. తెలంగాణాలో తలసాని శ్రీనివాసయాదవ్ కు మంత్రి పదవి ఇచ్చినపుడు తాను విమర్శించానని ఒప్పుకున్నారు. అయితే, అప్పటి పరిస్ధితులు వేరు, ఇప్పటి పరిస్ధితులు వేరట. అంటే ఫిరాయింపులు తప్పుకాదన్నట్లే మాట్లాడుతున్నారు. ఈ రెండేళ్ళల్లోనే పరిస్ధితుల్లో ఏం మార్పు వచ్చిందో నిప్పు చంద్రాబాబే చెప్పాలి.

ఫిరాయింపు ఎంఎల్ఏల్లో సమర్ధులకే తాను మంత్రి పదవులు కట్టబెట్టినట్లు తనకు తానే ఓ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసుకున్నారండోయ్. పైగా ఫిరాయింపులపై జాతీయ స్ధాయి చర్చ జరుగుతున్నది కదా, మంచిదే అన్నారు. ఫిరాయింపులపై జాతీయ స్ధాయిలో ఎక్కడా చర్చ జరగటం లేదు. జగన్ ఢిల్లీలో మకాం వేసి ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాష్ట్రపతి మొదలు కేంద్రమంత్రులను, ప్రతిపక్ష నేతలను కలుస్తున్నారంతే. నిజంగా జాతీయస్ధాయిలో చర్చ జరగటమంటే పార్లమెంట్ లో చర్చ జరగాలి. అప్పుడే జాతీయ స్ధాయిలో చర్చ జరిగినట్లు లెక్క. మరి, పార్లమెంట్ లో చర్చ జరపటానికి టిడిపి సానుకూలమేనా?

అదేవిధంగా ఫిరాయింపుల రాజీనామాలు స్పీకర్ పరిధిలో ఉన్నాయి కాబట్టి తానేమీ మాట్లాడలేరట. నిజంగా ఎంత పెద్ద జోకో. స్పీకర్ అంటే ఆయనేమన్నా స్వతంత్రప్రతిపత్తితో పనిచేసే వ్యక్తా? చంద్రబాబు ఆదేశాలకు లోబడి పనిచేసే వ్యక్తేకదా? పనిలో పనిగా మంత్రిపదవులు రానివారు అసంతృప్తికి గురికావద్దని హితవుపలికారు. ఇపుడు రాష్ట్రానికి కావాల్సింది రాజకీయలు కావని, అభివృద్ధేనని చెప్పారు. గడచిన రెండున్నరేళ్ళుగా రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్నదే రాజకీయమన్న సంగతి తెలియనిదెవరికి?