చంద్రబాబు మోసం చేస్తున్నారు

చంద్రబాబు మోసం చేస్తున్నారు

కాపులకు రిజర్వేషన్ కల్పించే పేరుతో చంద్రబాబునాయుడు కాపు సామాజికవర్గాన్ని మోసం చేస్తున్నట్లు అంబటి రాంబాబు ఆరోపించారు. వైసిపి అధికార ప్రతినిధి అంబటి శనివారం మీడియాతో మాట్లాడుతూ, బిసి కమీషన్ ఛైర్మన్ మంజూనాధకు తెలీకుండానే కమీషన్ సభ్యులు చంద్రబాబుకు నివేదిక ఇవ్వటమేంటని మండిపడ్డారు.

కమీషన్ సభ్యులిచ్చిన నివేదికపై చర్చించేందుకు ప్రభుత్వం సదరు నివేదికను వెబ్ సైట్లో ఎందుకు పెట్టలేదని నిలదీసారు. ఇపు కాపు నేతలకు ఇవ్వక అటు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న బిసి నేతలకు ఇవ్వకుండానే ప్రభుత్వం హడావుడిగా మంత్రివర్గంలో చర్చించటం, అసెంబ్లీలో తీర్మానం చేయటమేంటని మండిపడ్డారు.

ప్రభుత్వం తీరు చూస్తుంటే కాపులకు రిజర్వేషన్ కల్పించాలన్న చిత్తశుద్ది ఉన్నట్లు కనబడలేదన్నారు. ఇటువంటి తొందరపాటు తీర్మానాలు న్యాయస్ధానాల సమీక్షలో నిలబడవని అంబటి అభిప్రాయపడ్డారు. పోలవరంపై చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హడావుడిగా కాపుల రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారంటూ అంబటి ధజమెత్తారు. చంద్రబాబు తీరు వల్ల కాపులకు అన్యాయం జరగటం ఖాయమన్నారు.

అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన కాపులకు బిసి స్టేటస్ వచ్చేసినట్లేనా అంటూ ప్రశ్నించారు. శాస్త్రీయత లోపించిన ప్రక్రియ ఏది కూడా న్యాయసమీక్షలో నిలవలేదన్న విషయం గతంలో ఎన్నోమార్లు రుజువైందన్నారు. కాబట్టి మంజూనాధ కమీషన్ నివేదికను ప్రజల్లోకి చర్చకు పెట్టటమే కాకుండా అవసరమైన ప్రొసీజర్ ఫాలో అవ్వాలని అంబటి రాంబాబు సూచించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos