Asianet News TeluguAsianet News Telugu

పోలీసు భద్రత మధ్య చంద్రబాబు గృహప్రవేశం

చంద్రబాబు వెరైటీగా గృహప్రవేశానికి ఎవరినీ దగ్గరకు కూడా రానాయలేదు. బంధువులు, లేరు, సన్నిహితులు లేరు, సరే స్నేహితులు ఎటూ లేరనుకోండి అది వేరే సంగతి. పోని పార్టీలో సీనియర్ నేతలున్నారు. మంత్రివర్గముంది. అయినా సరే అతి దగ్గర వాళ్ళని అంటే వియ్యంకుడు బలకృష్ణ లాంటి మూడు, నాలుగు కుటుంబాలను  మాత్రమే పిలిచారట.

Naidu conducted house warming ceremony amidst police security

వందలాది పోలీసుల కాపలా, కట్టుదిట్టమైన భద్రత మధ్య చంద్రబాబునాయుడు కొత్త ఇంటి గృహప్రవేశం జరిపారు. ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్నారంటే సంతోషమే కదా? కాబట్టే బంధువులను, స్నేహితులను, సన్నిహితులను పిలవటం మామూలే. కానీ చంద్రబాబు వెరైటీగా గృహప్రవేశానికి ఎవరినీ దగ్గరకు కూడా రానాయలేదు. బంధువులు, లేరు, సన్నిహితులు లేరు, సరే స్నేహితులు ఎటూ లేరనుకోండి అది వేరే సంగతి. పోని పార్టీలో సీనియర్ నేతలున్నారు. మంత్రివర్గముంది. అయినా సరే అతి దగ్గర వాళ్ళని అంటే వియ్యంకుడు బలకృష్ణ లాంటి మూడు, నాలుగు కుటుంబాలను  మాత్రమే పిలిచారట. గృహప్రవేశాన్ని  ఎందుకంత రహస్యంగా చేయాల్సి వచ్చిందో చంద్రబాబే చెప్పాలి. పైగా మీడియా వాళ్లు దూరం నుంచి ఇంటిని సెల్ ఫోన్లో ఫొటోలు తీస్తే అది గమనించిన పోలీసులు వాటిని డిలీట్ చేసేంత వరకూ వదిలిపెట్టలేదట.

సరే ఇంటిగురించి కొన్ని వివరాలు చూద్దాం. చంద్రబాబునాయుడుకు విదేశాలపై ఉండే మోజు గురించి అందిరికీ తెలిసిందే. అందుకనే ఇంటి నిర్మాణం మొత్తం విదేశీమయం. జూబ్లిహిల్స్ 65లో పాత ఇంటి స్ధానంలో కట్టించుకున్న కొత్త ఇంటి ఇంటి వైశాల్యం సుమారు 20 వేల చదరపు అడుగులు. ఇంద్రభవనాన్ని మించి ఉంటుందని ప్రచారమైతే జరుగుతోంది. ఆదివారం గృహప్రవేశం కూడా జరిగింది. కొత్త భవనాన్ని మూడంతస్తుల్లో నిర్మించారు. విదేశీ నిపుణుల సూచనల మేరకు అత్యంత విశాలమైన పడకగదులు, లాన్లు ప్రత్యేకంగా రూపొందించారు.

భవనం పునాదులు మొదలు ప్రతీ చోటా విదేశీ వస్తు సామగ్రినే నిర్మించారట. యూరోప్ దేశాల నుండి దిగుమతి చేసుకున్న కళాఖండాలు, షాండ్లియర్లను కూడా అలంకరించారట. చివరకు మొక్కలను కూడా విదేశాల నుండే తెప్పించారు. ఇంటీరియర్స్ ఎంపిక కోసం విదేశాలకు వెళ్ళి మరీ తీసుకువచ్చారు. కొత్త ఇంటి ఆవరణలో ఏకంగా 20 కార్లను పార్క్ చేసుకోవచ్చు. ఇంట్లో అత్యాధునిక లిఫ్ట్ లను ఏర్పాటు చేసారు. విఐపి లాంజ్ లు, డైనింగ్ హాళ్ళు, స్టడీ-లైబ్రరి, పడక గదుల కోసం ప్రత్యేకమైన విదేశీ మెటీరియల్ వాడారు. ఎంత ఖర్చుతో నిర్మించారనే విషయంలో మాత్రం ఎవరికి వారు అంచనా వేసుకోవాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios