ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. అందుకనే హటాత్తుగా జిల్లా నేతలతో శనివారం మధ్యాహ్నం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. బహుశా అభ్యర్ధి ఎంపిక గురించే ఉండవచ్చని నేతలంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?

చూడబోతే చంద్రబాబునాయుడుకు నంద్యాల ఫీవర్ పట్టుకున్నట్లుంది. ఎందుకంటే, శనివారం మధ్యాహ్నం కర్నూలుజిల్లాలోని ఎంఎల్ఏలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలతో అత్యవసర సమావేశం పెడుతున్నారు. నంద్యాల ఉపఎన్నికలో గెలుపు తప్ప సబ్జెక్టు ఇంకేముంటింది చెప్పండి? ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మృతితో నియోజకవర్గం ఖాళీ అయినప్పటి నుండి చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. క్షేత్రస్ధాయిలో బలం లేదు. అయినా ఉప ఎన్నికల్లో గెలవాల్సిందే. లేకపోతే పరువు పోతుంది. దాంతో ఏం చేయాలో అర్ధంకాక అవస్తలు పడుతున్నారు.

నంద్యాల టిక్కెట్టు విషయంలోనే చంద్రబాబుతో విభేదించి శిల్పామోహన్ రెడ్డి మొన్ననే వైసీపీలో చేరిపోయారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో మద్దతుదారులు కూడా వెళ్లిపోయారు. దాంతో నియోజకవర్గంలో దాదాపు టిడిపి క్యాడర్ ఖాళీ అయిపోయినట్లే. దాని దెబ్బ నుండి చంద్రబాబు ఇంకా పూర్తిగా కోలుకోక ముందే భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డి కూడా పెద్ద బాంబును పేల్చారు.

తనకు మంత్రి అఖిలప్రియకు పడటం లేదని చెప్పి తన మద్దతుదారులతో అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసారు. దాంతో టిడిపి అధిష్టానం సుబ్బారెడ్డిని బ్రతిమాలుకుంది పార్టీ మారవద్దని. ఉప ఎన్నికలయ్యేంత వరకూ టిడిపిలోనే కొనసాగుతానని సుబ్బారెడ్డి చెప్పినా నమ్మటం కష్టం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. అందుకనే హటాత్తుగా జిల్లా నేతలతో శనివారం మధ్యాహ్నం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. బహుశా అభ్యర్ధి ఎంపిక గురించే ఉండవచ్చని నేతలంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?