నంద్యాల నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకున్న శిల్పా మోహన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. దాని ప్రభావం చంద్రబాబుపై బాగానే పడినట్లుంది.
పార్టీ నుండి బయటకు వెళ్ళి పోయే వాళ్ళు ఇంకా ఎవరున్నారంటూ చంద్రబాబునాయుడు ఆరాతీసారు. టిడిపి నేత, నంద్యాల నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకున్న శిల్పా మోహన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. దాని ప్రభావం చంద్రబాబుపై బాగానే పడినట్లుంది. శిల్పా పార్టీకి రాజీనామా చేసిన విషయమై ఈరోజు ఉదయం చంద్రబాబు జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆ సందర్భంగా మాట్లాడుతూ, శిల్పాతో పాటు పార్టీకి రాజీనామా చేసే వాళ్ళు ఎవరున్నారంటూ ప్రశ్నించారు. నియోజకవర్గాల వారీగా ఆరాతీసారు. అయితే, టెలికాన్ఫర్స్ లో మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ, పార్టీ నుండి వెళ్ళిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పారు. టిడిపిలోకి వస్తామని అంటున్న వాళ్ళే చాలామంది ఉన్నట్లు మంత్రి చెప్పారు. అయితే, ఇక్కడే అందరికీ ఓ అనుమానం వచ్చింది. పార్టీలోకి వచ్చేందుకు అంతమంది సిద్ధంగా ఉంటే మరి ఇంతకాలం ఎందుకు ఎవరు రాలేదు?
