ఇక రాష్ట్రంలో పేదవాళ్లు పెళ్లిచేసుకుంటే పెద్దన్న చంద్రబాబు ఆదుకుంటాడు. పెళ్లికానుకగా రాష్ట్ర ప్రభుత్వం రు.30 అందిస్తుంది. దీనికి నిన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ పథకానికి చంద్రన్న పెళ్లి కానుక అని పేరు పెట్టారు. ఈ పథకం వివరాలివి.

 

*వెనుకబడిన తరగతులకు చెందిన నూతన వధూవరులకు పెళ్లి సమయంలో ఆర్థిక సహాయం అందించే కొత్త పథకానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.   ‘చంద్రన్న పెళ్లి కానుక’ పేరుతో ఈ పథకం అమలు కానుంది. నూతన సంవత్సరం నుంచి ఈ పథకాన్ని ఆరంభిస్తారు.  ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు, దారిద్ర్య రేఖకు దిగువన వున్న బీసీ కులాలవారు అర్హులు. అబ్బాయికి 21, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి తీరాలని నిబంధన.  ఈ పథకం కింద పెళ్లి సమయంలో ఒక్కో జంటకు రూ. 30 వేలు ‘చంద్రన్న పెళ్లికానుక’ కింద అందిస్తారు.   2017-18 సంవత్సరంలో 40 వేల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. ఇందుకు రూ. 120 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనున్నది.   చంద్రన్న పెళ్లి కానుక పథకానికి మరో రెండేళ్ల తరువాత పదో తరగతి అర్హత విధించాలని సీయం సూచన.

క్యాబినెట్ ఆమోదించిన మరికొన్ని ముఖ్యాంశాలు:

*  ఇకనుంచి జనన, మరణాలతో పాటు వివాహ నమోదు కూడా తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం.

*పంచాయతీరాజ్, రెవిన్యూ శాఖలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యగులను నియమించే విషయం చర్చించారు. ఎంతమంది అవసరమో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వర్చువల్ క్లాసు రూమ్స్  

•  రాష్ట్రంలోని ఎంపికచేసిన పాఠశాలలలో క్లౌడ్ ఆధారిత వర్చువల్ క్లాసు రూమ్స్ ఏర్పాటు కోసం చేపట్టే ప్రాజెక్టును అమలు చేయడానికి, నిర్వహించడానికి ట్రిజిన్ టెక్నాలజీ లిమిటెడ్ అనే సంస్థ ఎంపికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

•  రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది.

•  ఎంపికచేసిన మున్సిపల్ పాఠశాలలలో వర్చువల్ క్లాస్ రూమ్స్ విధానాన్ని అమలుచేస్తారు.

•  ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 160 కోట్లు.

•  డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశం.

•  ఈ సంవత్సరం చివరినాటికి మొదటిదశగా అన్ని ఉన్నత పాఠశాలల్లో వర్చువల్ క్లాసురూమ్స్ కలిగి వుండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. రెండవ దశలో అన్ని స్కూళ్లల్లో వర్చువల్ క్లాసురూమ్స్ ఉండాలని నిర్దేశం.

•  వర్చువల్ క్లాస్‌రూమ్స్‌కు అవసరమైన కంటెంట్ తయారుచేసే పని విద్యాశాఖకు అప్పగింత. తగిన బృందాలను ఏర్పాటుచేసుకుని కంటెంట్ సిద్ధం చేసి, పర్యవేక్షణ బాధ్యత తీసుకోవాలని సూచన.

.

•గోపిచంద్ బ్యాట్మింటన్ అకాడమీ, బ్రహ్మకుమారీ సొసైటీ, నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ కేన్సర్ ఫౌండేషన్, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (XLRI), LV ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లకు భూములు కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం.  

అపోలో టైర్స్ :

•  చిత్తూరు జిల్లాలో ‘మోడ్రన్ అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టైర్ మ్యాన్యుఫాక్చరింగ్ ప్లాంట్’ ఏర్పాటు కోసం భూ కేటాయింపు పొందిన అపోలో టైర్స్ లిమిటెడ్‌ కోరిన మినహాయింపులకు మంత్రిమండలి ఆమోదం. ప్లాంటు ఏర్పాటులో జాప్యం జరిగినందుకు విధించిన అపరాథ రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తారు. ఆ మినహాయింపులు ఇవీ: A. కేటాయింపు ఉత్తరం పొందిన 10 పనిదినాల్లోగా ఎలాంటి వడ్డీ  లేకుండా జరిమానా చెల్లింపు. (వడ్డీ రద్దుతో రూ.79,28,680 లక్షలు). B. భూ కేటాయింపు పొందిన కంపెనీ కర్మాగారం ఏర్పాటుకు కావాలసిన అనుమతులు పొందడంలో జాప్యం జరిగిన పక్షంలో జరిమానా చెల్లింపు లేకుండా కాలపరిమితి పొడిగింపు. C. భూ యజమానికి చెల్లించాల్సిన నష్టపరిహారం సొమ్ము పెంచుతూ సివిల్ కోర్టులు ఆజ్ఞాపిస్తే ఆ నష్టపరిహారం సొమ్ము భూ కేటాయింపు పొందిన వారే చెల్లించాలి. D. రూ.7,28,680 రూపాయల వడ్డీ రద్దు (16%). కంపెనీ భూమి పొందినట్లుగా కేటాయింపు పత్రం తీసుకున్న 90 రోజుల్లోగా చెల్లించలేదు. భూకేటాయింపు పొందిన కంపెనీ తాజాగా పది రోజుల్లోగా  జాప్యం జరిగినందుకు ఎటువంటి వడ్డీ చెల్లించకుండా అసలు చెల్లించాలని ప్రతిపాదించింది.

అశోక్ లేల్యాండ్ కంపెనీ :

•  గ్రీన్‌ఫీల్డ్ ఎం&హెచ్.సి.వి ఉత్పాదక ప్రాజెక్టు ఏర్పాటుకు అశోక్ లేల్యాండ్ కంపెనీకి ప్రత్యేక ప్రోత్సాహకాలకు ఆమోదం. ప్రోత్సాహకాలు :  పదేళ్లపాటు 100% నెట్ SGST రిఇంబర్స్‌మెంట్‌కు అవకాశం. ప్రాజెక్టులో శిక్షణ వ్యయం ఒక్కొక్కరికి నెలకు రూ. 10వేలు. (శిక్షణ, ఉపాధి పొందిన వారికి). అనుబంధ యూనిట్ల స్థాపనకు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి. అశోక్ లేల్యాండ్ లిమిటెడ్‌కు ఎకరా ఒక్కింటికి రూ.16.50 లక్షల వంతున 50 ఎకరాలు, ఆర్.వి.ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు  25 ఎకరాలు కేటాయింపు.