నంద్యాలకు మరో కానుక ఇచ్చిన బాబు ఎపిలో రెండో అన్న క్యాంటీన్ నంద్యాలకు మంజూరు ఉప ఎన్నికల వరం అంటున్న రాజకీయ వర్గాలు తర్వాత రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తామని సిఎం ప్రకటన

ఉప ఎన్నికల ఊపులో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాలకు మరొక కానుక విడదలు చేశారు. నంద్యాల ‘అన్న క్యాంటిన్’ మొదలవుతుంది. పేదలకు సబ్సిడీతో చౌకగా భోజనం దొరికే ఈ తరహా క్యాంటిన్ ఇపుడు ఒక్కటే వెలగపూడిలో పనిచేస్తూ ఉంది. ఇపుడు ఎన్నికల పుణ్యమా అని నంద్యాలకు వస్తున్నది. కాకపోతే, నంద్యాల పట్టణంతో విజయవాడ,మంగళగిరిలలో కూడా రెండు క్యాంటీన్లు వస్తాయి. ఈ మూడు బుధవారంనాడు ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా కొద్దిసేపటి కిందట అమరావతిలో ప్రకటించారు.
తర్వాత, 14 నగర పాలక సంస్థలు, 2 జిల్లా కేంద్రాలలతో మొత్తం 200 సెంటర్లలో తొలి విడతగా ‘అన్న క్యాంటీన్’లు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.
ప్రీ ఫ్యాబ్ పద్దతిలో పూర్తి హైజీనిక్ గా అంటే శుచిగా ఆహారం అందించేందుకు ‘అన్న కాంటీన్ల’ పూనుకుంటాయని చెబుతూ మిగతా వన్నీ అక్టోబరు 2న ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.
‘అన్న క్యాంటీన్ ఫౌండేషన్’ పేరుతో ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటుచేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.
తిరుమల అన్నదానం తరహాలో డొనేషన్స్ ఈ క్యాంటీన్లకు విరాళాలు సేకరిస్తామని అంటున్నారు.
పుట్టినరోజు వంటి ఫంక్షన్లకు విరాళాలు ఇచ్చిన దాతల పేరుతో అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం అందిస్తామని ఆయన చెప్పారు.