విజయవాడ: ఏపీ రాష్ట్రానికి చెందిన సరిహద్దులోని తెలంగాణలోని కోదాడ నుండి మద్యం తీసుకొచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.

వరలక్ష్మి  నివాసం ఉండే ఇంటి వద్ద కారు పార్కింగ్ కు స్థలం లేదు. దీంతో వేరే అపార్ట్ మెంట్ వద్ద కారును పార్క్ చేస్తారు.  ఈ కారును  పార్క్ చేసిన  అపార్ట్ మెంట్ వద్ద సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలించారు.

also read:కారులో మద్యం సీసాలు: కనకదుర్గ ట్రస్ట్ బోర్డు పదవికి నాగవరలక్ష్మి రాజీనామా

తెలంగాణలోని కోదాడ నుండి వరలక్ష్మి కొడుకు సూర్యప్రకాష్ గుప్తా, డ్రైవర్ శివకుమార్  మద్యాన్ని తీసుకొచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.కారులో మద్యం తరలింపు విషయమై తనకు తెలియదని వరలక్ష్మి చెప్పడంపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు.

రెండు మాసాల క్రితమే సూర్యప్రకాష్ అమెరికా నుండి వచ్చాడు. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నందున తెలంగాణ నుండి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

తన కారులో మద్యంం లభించిన ఘటనతో దుర్గగుడి ట్రస్టు బోర్డు పదవికి  వరలక్ష్మి  గురువారం నాడు ఉదయం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రాజీనామాకు దుర్గగుడి పాలకవర్గం ఆమోదం తెలిపింది.