సీఎం జగన్ గురించి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ముఖ్యమంత్రి జగన్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏ అసెంబ్లీలో ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు.. రోజమ్మ నా చెల్లి.. ఏ తప్పు చేయలేదని’ చెప్పారు.. ఆ మాటతో ఆయనకు జీవితాంతం రుణ పడి ఉంటానని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

మంత్రి పదవిపై ఎప్పుడూ ఆశపడ లేదన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. జగన్ ముఖ్యమంత్రి అయితే చాలు.. తామూ ముఖ్యమంత్రులం అయినట్లే భావించామన్నారు. ఎవరి నియోజకవర్గానికి నేను వెళ్లను, ఎవరైనా నా నియోజకవర్గంలో ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోను అన్నారు. ఇదే విషయాన్ని జగన్‌కు చెప్పానని చెప్పుకొచ్చారు.
గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.. జిల్లాను కంట్రోల్ చేసే వ్యక్తి కాబట్టి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై తాను తప్పుగా భావించలేదన్నారు. మంత్రి పదవి రాకపోయినా.. తనకు, పదవి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పెద్దిరెద్డి కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు రోజా. ఎంపీ మిథున్ రెడ్డి తనను అక్కలా భావిస్తారని, ఎంతో గౌరవం ఇచ్చారన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తన తండ్రి మంచి స్నేహితులని ఆసక్తికర విషయాలు చెప్పారు. తాము చిన్నప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తూ పెరిగామని అన్నారు రోజా. తనకు రాజకీయాలు అంతగా తెలియవు, రాజకీయంగా పెద్దిరెడ్డి తమకు అండగా ఉన్నారన్నారు. తనకు ఫాదర్ లేనప్పుడు ఫాదర్‌లాగే, మిథున్ బ్రదర్‌లా ఫుల్ సపోర్ట్ ఇచ్చారన్నారు. తనకు ఎయిరో హోస్టెస్ కావాలని ఉండేదని, తల్లిదండ్రులకు మాత్రం తనను డాక్టర్ చేయాలని ఉండేదని కానీ అనుకోకుండా సినిమాల్లోకి అటునుండి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు.