విజయవాడ: తన కూతురికి ఫత్వా జారీ చేసినా  వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తోందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పష్టం చేశారు. మత పెద్దలు ఫత్వా జారీ చేసినా కూడ తమ పని తాము చేసుకొంటూ వెళ్తామని ఆయన తేల్చిచెప్పారు.

తన కూతురుకు ముస్లిం మత పెద్దలు ఫత్వా జారీ చేసిన విషయమై సోమవారం నాడు జలీల్ ఖాన్ స్పందించారు. 2009 ఎన్నికల సమయంలో  మల్లికాబేగానికి మత పెద్దలు ఫత్వా జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కానీ, ఆ ఫత్వాను మల్లికాబేగం గౌరవించలేదని ఆయన గుర్తు చేశారు.ఆనాడు ఫత్వాను గౌరవించని మల్లికా బేగం ఎలా ఇవాళ తన కూతురు పోటీ విషయమై ప్రశ్నిస్తోందన్నారు. 2009 నాటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు మధ్య చాలా తేడా వచ్చిందన్నారు. ఫత్వా జారీ చేసిన కూడ పోటీ చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

మల్లికా బేగం ఎఫెక్ట్: జలీల్‌ఖాన్ కూతురికి ఫత్వా చిక్కులు