Asianet News TeluguAsianet News Telugu

మల్లికా బేగం ఎఫెక్ట్: జలీల్‌ఖాన్ కూతురికి ఫత్వా చిక్కులు

విజయవాడ: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు మరో చిక్కు ఎదురైంది. జలీల్ ఖాన్‌ కూతురు షబానా ఖాతూరు‌పై ముస్లిం మత పెద్దలు సోమవారం నాడు ఫత్వా జారీ చేశారు. త్వరలో  జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో షబానా పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేస్తోందని జలీల్ ఖాన్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

abdul khadir rijwi issues fatwa to jaleel khans daugher shabana
Author
Vijayawada, First Published Feb 25, 2019, 4:48 PM IST

విజయవాడ: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు మరో చిక్కు ఎదురైంది. జలీల్ ఖాన్‌ కూతురు షబానా ఖాతూరు‌పై ముస్లిం మత పెద్దలు సోమవారం నాడు ఫత్వా జారీ చేశారు. త్వరలో  జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో షబానా పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేస్తోందని జలీల్ ఖాన్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

2014 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుండి జలీల్ ఖాన్ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో  జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూరు పోటీ చేస్తోందని జలీల్ ఖాన్ ప్రకటించారు.ఈ ప్రకటనపై  టీడీపీ నేత నాగుల్ మీరా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  మీరాను విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్లారు.

ఇస్లాం మత సంప్రదాయం ప్రకారంగా బుర్ఖా లేకుండా అబ్దుల్ ఖదీర్ రిజ్వీ ఫత్వా జారీ చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో జలీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, ఆ ఎన్నికల్లో  జలీల్‌ఖాన్‌కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మల్లికా బేగం‌ టిక్కెట్టు దక్కింది.

అయితే ఈ సమయంలో మల్లికాబేగం‌పై ఫత్వా జారీ చేశారు. జలీల్ ఖాన్  ఒత్తిడి కారణంగానే ఆ సమయంలో తనపై ఫత్వా జారీ చేశారని మల్లికాబేగం రెండు రోజుల క్రితం ఆరోపణలు చేశారు. ఆనాడూ తనపై ఫత్వా జారీ చేసిన మత పెద్దలు జలీల్ ఖాన్ కూతురు విషయంలో  ఎందుకు స్పందించరని ఆమె ప్రశ్నించారు.

మల్లికాబేగం ఆరోపణలు చేసిన రెండు రోజులకే జలీల్ ఖాన్ కూతురిపై సోమవారం నాడు ముస్లిం మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి షబానా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తోందని  జలీల్ ఖాన్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.

ఈ ప్రకటననను నిరసిస్తూ పార్టీ నేత నాగుల్ మీరా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై విజయవాడ ఎంపీ కేశినేని నాని నాగుల్ మీరాను బాబు వద్దకు తీసుకెళ్లిన విషయం బుజ్జగించిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios