దేవాలయాల్లో ముస్లింల ప్రత్యేక పూజలా ? (వీడియో)

First Published 4, Dec 2017, 3:42 PM IST
Muslims performing special pujas to lord Venkateswara in kadapa
Highlights
  • ముస్లింలకు-హిందువులకు మధ్య చాలా చోట్ల వైరుధ్యం కనబడుతుంది

ముస్లింలకు-హిందువులకు మధ్య చాలా చోట్ల వైరుధ్యం కనబడుతుంది. అందులో భాగంగానే ముస్లింలు చాలా చోట్ల హిందు దేవాలయాలవైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. అదే విధంగా హిందువుల్లో కూడా దర్గాల్లోకి వెళ్ళే వాళ్ళు తక్కువే. కానీ దేవుని గడప అయిన కడపలో మాత్రం విచిత్రమైన సన్నివేశాలు కనబడుతుంటాయి. పట్టణంలో లక్ష్మీ వెంకటేశ్వరాలయం అనే ప్రసిద్ధ దేవాలయం ఉంది. ఈ ఆలయానికి ప్రతీ రోజు క్రమం తప్పకుండా హిందువులతో పాటు ముస్లింలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. స్వామివారికి ప్రార్ధనలు, ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. వీడియో చూడండి మీకే తెలుస్తుంది.

 

loader