వైసిపి నేత హత్యకు కుట్ర  (వీడియో)

వైసిపి నేత హత్యకు కుట్ర  (వీడియో)

అనంతపురం జిల్లాలోని వైసిపి నేతపై హత్య పథకం వెలుగులోకి వచ్చింది. సకాలంలో పోలీసులు అప్రమత్తమవటంతో హత్య కుట్ర భగ్నమైంది. జిల్లాలోని బిసి నేత ధనుంజయ్ యాదవ్ హత్యకు టిడిపికి చెందిన ఓ పెద్ద నేత స్కెచ్ వేసినట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు పదిమందిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేక తమ నేతల హత్యలకు టిడిపి కుట్రలు పన్నుతోందని వైసిపి నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 10 మంది కిరాయిహంతక ముఠాగా త్రి టౌన్ పోలీసులు గుర్తించారు.

ధనుంజయ్ యాదవ్ వైసీపీ తరపున మంత్రి పరిటాల సునీత నియోజకవర్గమైన రాప్తాడులో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. యాదవ్ కు గ్రామీణ ప్రాంతాల్లో బాగా పట్టున్న నేతగా వైసిపి నేతలు చెబుతున్నారు. యాదవ్ హత్యకు టిడిపి నేత రూ. 30 లక్షలకు కిరాయికి మాట్లాడుకున్నారట. వైసిపి నేత అడ్డు తొలగించుకునేందుకు మంత్రే హత్యకు కుట్ర పన్నినట్లు తోపుదుర్తి ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఫిర్యాదు చేయటానికి వైసిపి నేతలు జిల్లా ఎస్పీని కలవటానికి ప్రయత్నిస్తున్నారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos