మున్సిపల్ ఎన్నికలకు జగన్ ప్రభుత్వం అంగీకారం: నిమ్మగడ్డకు తొలగిన అడ్డంకులు

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమైంది.వచ్చే నెల మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం కూడ అంగీకరించింది.

municipal elections likely to conduct in march month lns

అమరావతి: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమైంది.వచ్చే నెల మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం కూడ అంగీకరించింది.మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధిం రాష్ట్ర ప్రభుత్వం  కూడ ఓకే చెప్పింది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెల 23వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్హణపై న్యాయ నిపుణుల సూచలన తర్వాత ఎస్ఈసీ నిర్ణయం తీసుకోనుంది. గతంలో కొన్ని చోట్ల మున్పిపల్ ఎన్నికల ప్రక్రియ సాగింది. కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ నిలిపివేశారు.

 

గతంలో ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందో అదే చోటు నుండి  ఈ ప్రక్రియను కొనసాగించాలని ఎస్ఈసీ భావిస్తోంది.ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కూడ ఎన్నికల సంఘం ప్రతిపాదనకు అంగీకరించినట్టుగా సమాచారం.

మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన చోటు చేసుకొన్న న్యాయపరమైన ఇబ్బందుల గురించి చర్చించనుంది. ఈ ఇబ్బందులు తొలగిన తర్వాత ఈ ఎన్నికలు కూడ నిర్వహించే అవకాశం లేకపోలేదు.ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ ఎన్నికలు పూర్తైన తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నోటిపికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios