బ్యాంకుల ముందు చెత్తపోసిన ఘటనపై ఉయ్యూరు మున్సిపల్ కమీషనర్ ప్రకాశ్ రావు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనతో ప్రభుత్వానికి, అధికారులకు ఎటువంటి సంబంధం లేదన్నారు.

మున్సిపల్ సిబ్బంది, లబ్ధిదారులు చేసిన చర్య వల్ల బ్యాంకర్ల మనోభావాలు దెబ్బతిని ఉంటాయని అందుకే వారి తరపున క్షమాపణలు కోరుతున్నానని అన్నారు.

భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని ప్రకాశ్ చెప్పారు. బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాలని, అంతర్గత విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ప్రకాశ్ రావ్ హామీ ఇచ్చారు.

కాగా, ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త కుప్పలు హాట్ టాపిక్ అయ్యింది. ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ల ఎదురుగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెత్తను కుప్పలు తీసుకొచ్చి పోశారు.