Asianet News TeluguAsianet News Telugu

అమరావతి దాకా ముద్రగడ ‘కాపు యాత్ర’

కాపు రిజర్వేషన్ పాదయాత్రలు విఫలమవుతున్నా మ ాజీ  మంత్రి ముద్రగడ పద్మనాభం  యాత్రలు మానడం లేదు. ఈ సారి అమరావతి దాకా పాదయాత్రచేయాలనుకుంటున్నారు. జూలై్ 26న  కిర్లంపూడిలో యాత్రలోమొదలువుతుందని ప్రకటించారు. గతంలో  ఆయన తలపెట్టిన యాత్రలను ప్రభుత్వం భగ్నం చేసింది. ఈ సారేమవుతుందో చూడాలి. ఇలాంటి యాత్రలు సాగవు అని పోలీసులు అంటూంటే,  తాను ఆగనని ఆయనా చెబుతున్నారు.

mudragadaplans kapu yatra to Amaravati in July

కాపు రిజర్వేషన్ పాదయాత్రల విఫలమవుతున్న నేపథ్యంలో మ ాజీ ముద్రగడ పద్మనాభం ఈ సారి అమరావతి దాకా పాదయాత్రచేయాలనుకుంటున్నారు. జూలై 26న  కిర్లంపూడిలో యాత్రలోమొదలువుతుందని ప్రకటించారు.

 

కాపు రిజర్వేషన్ల  ఉద్యమం ప్రారంభమై జూలై 26 నాటికి రెండేళ్లవుతుందని, దాని నెమరేసుకుంటూ ఈ  పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన  ప్రకటించారు.

 

ఈ యాత్ర రూట్ మ్యాప్ తొందర్లో ప్రకటిస్తానని కాపునేత చెప్పారు. అంతేకాదు, రూట్ మ్యాప్ ని ఏకంగా ముఖ్యమంత్రికే పంపిస్తానని కూడా ముద్రగడ ఈ రోజు కాకినాడలో ప్రకటించారు.

‘చంద్రబాబుకి జ్ఞాపక శక్తి లేదు. అందుకే ఇచ్చిన హామీలు ఇచ్చినట్లే మర్చిపోతున్నారు.  అన్యాయం చేసిన వారికి ఎలా బుద్ధిచెప్పాలో కాపులకు తెలుసు’ అని ఆయన అన్నారు. 

ఈ విషయం మీద ముద్రగడ ముఖ్యమంత్రి లేఖ కూడా రాశారు. 

 

mudragadaplans kapu yatra to Amaravati in July

 

 

తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ అయిన కాపులకు బిసి హోదా అమలుపర్చాలని చెబుతూ ముద్రగడ పద్మనాభం గత రెండేళ్లు అలుపెరుగని పోరాటంచేస్తున్నారు. ధర్నాలు చేశారు. నిరాహార దీక్షలు చేశారు. పాదయాత్రలు చేపట్టారు. అయితే, అయితే ఉద్యమం కాపులను ఏకం చేసేలా ఉండటంతో రిజర్వేషన్ల అధ్యయంన చేసేందుకు ఒక కమిషన్ వేశారు. ఈ కమిషన్ నివేదిక  సమర్పించడం  జాప్యం అవుతూ ఉండటంతో ముద్రగడ మళ్లీ ఉద్యమంలోకి దిగుతున్నారు.

 

 ఈ సారి సొంతవూరు కిర్లంపూడినుంచి రాజధాని అమరావతి వరకు పాదయాత్ర చేయలనుకుంటున్నారు. ఈయాత్ర జూలై 26 న మొదలవుతుందని చెప్పారు.

 

అయితే, ఈ యాత్రను అనుమతిస్తారా?

 

ఎందుకంటే, గతంలో ఆయన యాత్రలక అనుమతినీయలేదు. శాంతి భద్రతలు తలెత్తుతాయని, తుని ఘటన చూపి,పోలీసుల కిర్లంపూడి లో ఆంక్షలు విధించారుు. ఆయనను గృహనిర్భంధంలో ఉంచారు.

ఇపుడు మళ్లీ ఆయన ఈ యాత్రకు పూనుకుంటున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios