సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇటీవల జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. కాగా..లక్ష్మీ నారాయణ జనసైనికుడిగా మారడంపై విజయసాయి రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకునే లక్ష్మీ నారాయణ జనసేనలో ఎలా చేరారంటూ ప్రశ్నించారు. 

‘‘ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మినారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేసారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?’’ అంటూ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో..35 ఏళ్లుగా చంద్రబాబు పులివెందుల అబ్సెషన్ తో బాధపడుతున్నారు. 14 సంవత్సరాలు సిఎంగా ఉండి కూడా ఈ ఫోబియాల నుంచి బయట పడలేక పోయారేమిటి తుప్పు నాయుడు గారూ? అర్థంలేని భయాలను ప్రజలకు అంటించాలని చూస్తున్నారు. మంచి డాక్టర్ ను కలవండి  ట్రీట్మెంట్ ఇస్తాడు.’’ అని పేర్కొన్నారు. 

‘‘అలెగ్జాండర్ కు 10 లక్షల సైనికులుంటే ఉంటే తనకు 65 లక్షల సైన్యం ఉందని చంద్రబాబు కటింగులిస్తున్నాడు.కొట్టేసిన 3.75 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు కూడా ఉన్నాయని చెప్పండి పనిలో పనిగా. తెలుగుదేశం గాలి వీస్తోందని మీనోటితో ఇంకో సారి అనకండి సార్.ఫ్యాన్ గాలి వీస్తోందని వినిపిస్తుంది ప్రజలకు.’’ అని  విజయసాయిరెడ్డి అన్నారు.