ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా..‘‘ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నేనెవరికీ భయపడను, నన్నెవరూ భయపెట్టలేరంటూ గింజుకుంటున్నాడు. చంద్రబాబూ...నువ్వో చచ్చిన విషసర్పానివి. నిన్నెవరూ భయపెట్టడం లేదు. అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్నావు. ఎన్నికల్లో చిత్తుగా ఓడించాక అది మరింత ముదిరింది.’’ అని పేర్కొన్నారు.

 

ఇదిలా ఉండగా... ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నేతలు శుక్రవారం పార్టీలో చేరారు.  14, 15, 25 వార్డుల నుంచి 500 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ సీఎం వైఎస్‌ జగన్ సంక్షేమ కార్యక్రమాలు చూసి టీడీపీ నేతలు పార్టీలోకి వస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయి. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధిస్తాం. విశాఖ అభివృద్ధికి వైఎస్సార్‌ సీపీ కట్టుబడి ఉంది.’’ అని అన్నారు.