ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఎప్పటికప్పుడు టీడీపీ నేతలు, చంద్రబాబు, లోకేష్ లపై సోషల్ మీడియా వేదికగా విజయసాయి సెటైర్లు వేస్తూనే ఉంటారు. తాజాగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పేరు ప్రస్తావించి మరీ కౌంటర్లు వేయడం విశేషం. ట్విట్టర్ వేదికగా  ఆయన ఈ విమర్శలు చేశారు.

.Also Read నారావారిపల్లెలో వైసీపీ సభ: చంద్రబాబు స్పందన ఇదీ...

'కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. తుపానులను నియంత్రించగల అతీంద్రియ శక్తులున్న చంద్రబాబు నాయుడి వైపు ప్రపంచమంతా చూస్తోందని ట్వీట్ చేశారు. 

కరోనా వైరస్ బారినుంచి కాపాడేందుకు ఆయన ఏదో ఒకటి చేయకపోతే ఈ భూమ్మీద మనుషులెవరూ మిగలరని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అందరూ ఆందోళన చెందుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘సంక్షేమ పెన్షన్లను ఒకటో తేదీన ఇచ్చే పద్ధతి దేశంలో ఎక్కడా లేదు. ఇచ్చినా బ్యాంకుల్లోనో, పోస్టాఫీసుల్లోనో తీసుకోవాల్సి ఉంటుంది. సిఎం జగన్ గారి ఆదేశాలతో ఒకటో తేదీన వలంటీర్లు పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తున్నారు. ఇంకా చాలా చూడాలి. కళ్లల్లో నిప్పులు పోసుకోకు బాబూ.’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.

‘‘భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రకటనకు ముందే ఇన్‌సైడర్ ట్రేడింగులో చంద్రబాబు బినామీలు చుట్టుపక్కల భూములను చుట్టేశారు. దానిపైనా విచారణ జరిగితే నీతిచంద్రికల బండారం బయట పడుతుంది. విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, కోస్టల్ రెగ్యులేషన్ల అతిక్రమణలు, మీరు చేయని అక్రమాలు లేవు.’’అంటూ విమర్శించారు.