ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు ఎంపీ విజయసాయి రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు ఎంపీ విజయసాయి రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మహానేత వైఎస్సార్‌కు ఆదర్శ సతీమణిగా నిలిచారని.. జననేత వైఎస్ జగన్‌కు జన్మనిచ్చి ధన్య మాత అయ్యారని పేర్కొన్నారు. ఈ మేరకు విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.విజయమ్మకు జన్మదిన శుభకాంక్షలు తెలిపిన ఆయన.. ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్టుగా పేర్కొన్నారు. వైఎస్ జగన్, విజయమ్మలతో కూడిని ఓ ఫొటోను కూడా విజయసాయి రెడ్డి షేర్ చేశారు.
ఇంకా.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూడా విజయసాయి రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుని అనుగ్రహంతో వేమిరెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో.. మరెన్నో ఆనందరకరమైన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
ఇక, నేడు విజయమ్మ జన్మదినం సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
