బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మా కుటుంబానికి తెలియవన్నారు నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. తనను కలిసిన లగడపాటి, సుజనాచౌదరిలతో ఆయన భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  

జిల్లాలో నీతి, నిజాయితీగా రాజకీయాలు చేశామని రాయపాటి స్పష్టం చేశారు. నా కన్నా నిబద్ధతతో పనిచేసే నేతలు ఉంటే టికెట్ అడగని సాంబశివరావు వెల్లడించారు. మాకు  చంద్రబాబు అన్యాయం చేయరని అనుకుంటున్నట్లు తెలిపారు.

కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రాయపాటి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఎంతో మందికి సీట్లు ఇప్పించానని సాంబశివరావు అన్నారు. అయినప్పటికీ టీడీపీలో తాను ఇంకా జూనియర్‌నేనన్నారు.

30 ఏళ్లకు పైగా చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉందని రాయపాటి గుర్తు చేశారు. మా కుటుంబానికి ఎలా న్యాయం చేయాలో బాబుకు తెలుసన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ వేత్త, ఎంపీ రాయపాటి సాంబశివరావు అలకబూనారు.

ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన కుమారుడికి టిక్కెట్ కేటాయించాల్సిందిగా చంద్రబాబును రాయపాటి కోరారు. తనకు నరసరావుపేట పార్లమెంట్ స్థానం, తన కుమారుడు రంగారావుకి సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు.

అయితే సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల మరోసారి పోటీ చేస్తారని ప్రచారం సీఎం తేల్చి  చెప్పడంతో సాంబశివరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన టీడీపీని వీడుతున్నారంటూ ప్రచారం  జరిగింది. 
 

రాయపాటికి లోకేష్ ఫోన్: తొందరొద్దన్న చినబాబు

రాయపాటి అలక, కుటుంబసభ్యులతో భేటీ: రంగంలోకి లగడపాటి, సుజనా

సీట్ల లొల్లి: అసంతృప్తిలో రాయపాటి, పార్టీ వీడేనా?