నాపై థర్డ్ డిగ్రీ మానవ హక్కుల ఉల్లంఘనే: ఎన్‌హెచ్‌ఆర్‌సి ఛైర్మన్ కు రఘురామ పిర్యాదు

తనను అక్రమంగా అరెస్ట్ చేసిన ఏపీ సిఐడి పోలీసులు నిర్భంధంలో వుంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు చేశారు. 

MP Raghuramakrishnam Raju complaints NHRC akp

న్యూడిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సీఐడి అధికారులపై జాతీయ మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ పిసి పంత్ కు ఫిర్యాదు చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు నిర్భంధంలో వుంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ తెలిపారు. విచారణ పేరిట తీసుకువెళ్లి ఇలా మానవ హక్కుల ఉళ్లంఘనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు. 

ఇప్పటికే తన తండ్రి రఘురామ అరెస్ట్‌ తీరుపై ఎన్‌హెచ్‌ఆర్సీకి భరత్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ  అరెస్ట్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ కూడా సీరియస్ అయింది. ఈ మేరకు ఇప్పటికే ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు ఎన్‌హెచ్‌ఆర్సీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది.  నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కస్టడీలో రఘురామపై పోలీసుల దాడికి సంబంధించి అంతర్గత విచారణ చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 7లోగా నివేదికను ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది.

read more సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ మీద రఘురామ సంచలన ఆరోపణలు  
 
సుప్రీంకోర్టు షరతులతో కూడిన  బెయిల్‌ మంజూరు చేయడంతో ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీకి వెళ్లారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన రఘురామకృష్ణంరాజు ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఎయిమ్స్ లో ఎంపీ రఘురామ కృష్ణంరాజును కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎయిమ్స్ వైద్యులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలుచేసేలా వ్యవహరించినందుకుగాను ఈ నెల 14వ తేదీన ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios