Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ మీద రఘురామ సంచలన ఆరోపణలు

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కెపి రెడ్డిపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.

YCP MP raghurama Krishnam Raju makes allegations against KP Reddy od Secendurabad army hospital
Author
New Delhi, First Published May 30, 2021, 5:36 PM IST

అమరావతి: సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి కేపీ రెడ్డిపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు.  ఆర్మీ ఆస్పత్రి నుంచి తనను త్వరగా డిశ్చార్జ్ చేసేందుకు కేపీ రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు రఘురామ కృష్ణం రాజు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. 

రాజ్ నాథ్ సింగ్ ఆయన మూడు పేజీల లేఖను రాశారు. కేపీ రెడ్డి, టీటీడీ ఏఈవో ధర్మా రెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి కలిసి తనను ఏపీ సిఐడికి అప్పగించేందుకు కట్రు చేశారని ఆయన రక్షణం త్రికి ఫిర్యాదు చేశారు. మఫ్టీ పోలీసులు ఆస్పత్రిలో మకాం వేసేందుకు కేపీ రెడ్డి సహకరించారని కూడా ఆయన ఆరోపించారు. 15 మంది ఏపీ పోలీసుల మెస్ బిల్లులను లేఖకు జత చేశారు. కేపీ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఇదిలావుంటే, హైదరాబాదులో ఏపీ సీఐడి అధికారులు తనను అరెస్టు చేయడంపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఓ ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్రం పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలను, మార్గదర్శకాలను హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పట్టించుకోలేదని ఆయన కేసీఆర్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. 

ఆ అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పలు సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు, పోలీసు మాన్యువల్ చెబుతున్న మార్గదర్శకాలను రఘురామ తన లేఖలో వివరించారు తన అరెస్టు విషయంలో జరిగిన నియమ నిబంధనల ఉల్లంఘనలను ఆయన కేసీఆర్ కు రాసిన లేఖలో తెలిపారు. ఆ మేరకు ఆయన 8 పేజీల లేఖ రాశారు. 

తనపై ఏపీ సిఐడి సూమోటోగా కేసు నమోదు చేసిందని, ఈ కేసును గుంటూరు సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ నేతృత్వంలో పర్యవేక్షిస్తోందని, ఈ నెల 14వ తేదీన హైదరాబదు గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ లోని తన నివాసమైన 74వ నెబంర్ విల్లాకు ఒక బృందం వచ్చిందని ఆయన చెప్పారు. తనను ఏపీ సిఐడి అరెస్టు చేసేందుకు వచ్చినప్పుడు గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కనీసం పోలీసు మాన్యూవల్ ను కూడా పట్టించుకోలేదని ఆయన కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. 

ఎంపీనైన తన అరెస్టుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా పరిశీలించలేదని, ఏపీ సిఐడి నుంచి ట్రాన్సిట్ రిమాండ్ ఆర్డర్ తీసుకోలేదని, అసలు ఎఫ్ఐఆర్ ఉందో లేదో కూడా పరిశీలించలేదని ఆయన చెప్పారు 

తనను అరెస్టు చేసే ముందు తన ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఆస్పత్రిలో పరీక్షలు చేయించాలనే నిబంధనను కూడా పట్టించుకోలేదని, తనను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఏపీసిఐడి న్యాయబద్దంగా, చట్టబద్దంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యతను విస్మరించారని ఆయన విమర్శించారు. 

రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో భాగంగా తన అరెస్టుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని, అది కూడా తీసుకోలేదని ఆయన చెప్పారు. తెలంగాణ సరిహద్దును దాటే ముందు ప్రస్తుత నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుంతి ఏపీసిఐడి తీసుకోలేదని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios