న్యూడిల్లీ: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన ప్రజానాయకుడని... ఆయన ఏ ఒక్కరి సొత్తో కాదంటూ సీఎం జగన్, వైసిపి నాయకులకు ఎంపీ రఘురామకృష్ణంరాజు చురకలు అంటించారు. ఆయన కేవలం కొడుకు సొత్తు మాత్రమే కాదని... యావత్ తెలుగు ప్రజల సొత్తని అన్నారు. 

వైఎస్సార్ 11వ వర్దంతిని పురస్కరించుకుని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనంటే తనకు అపారమైన గౌరవమని... అందువల్లే తన మనవడికి ఆయన పేరే పెట్టామని రఘురామ తెలిపారు. 

read more   ఈ బాబైనా.. ఆ బాబైనా వాళ్ల సొమ్ము కాదుగా : జగన్, చంద్రబాబులపై సోము వీర్రాజు వ్యాఖ్యలు

ఎంతో మందికి అడగకుండానే సాయం చేసిన వ్యక్తిత్వం వైఎస్ఆర్ సొంతమని, ఇవాళ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా రాజకీయ అంశాలపై మాట్లాడనని చెప్పుకొచ్చారు. వర్ధంతి కావున ఆయన గుణగణాలు మాత్రమే చెప్పగలనని.. రేపు అన్ని విషయాలపై చర్చిస్తానన్నారు. 

తన పంచెకట్టు వైఎస్ఆర్ నుంచి కాపీ చేసిందేనని అన్నారు. ఆయన వ్యక్తిత్వం అందరికీ రాదని.. బోయవాడు వాల్మీకిగా మారినట్టు.. సీఎం అయ్యాక ఆయన మారిపోయారన్నారు. వైఎస్ రాగద్వేషాలను దగ్గర నుంచి గమనించానని, ప్రాక్టికల్‌గా చూశానన్నారు. తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన రోజు తన పుట్టిన రోజని ఆ నాటి సంగతులను రఘురామ గుర్తు చేసుకున్నారు.