పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు మన దేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ జరుగుతున్నాయన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ఈ మధ్య దేశభక్తి గురించి ఎక్కువగా చెబుతున్నారని వీర్రాజు  అన్నారు.

బిజెపి జాతీయ వాదం ప్రాతిపదికగా ఏర్పాటు చేసిన పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. ఈ బాబు అయినా ఆ బాబు అయినా వారి సొమ్ము కాదు కాబట్టి వారి ఇష్టం వచ్చినట్టు పంచుతున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

చంద్రబాబు పసుపు కుంకుమ పేరుతో సొమ్ములు పంచారని... ఆయనకు ఆయన చెందిన ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ ను ఆయినా ఉచితంగా ఇచ్చారా అని వీర్రాజు  నిలదీశారు. ఇప్పుడున్న బాబు ఆయనకున్న ఆస్తిలో సెంటు భూమి అమ్మి ఇవ్వగలడా అన్న ఆయన.. ఇది జాతీయవాదానికి మంచిది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

 

"