MP Raghu Rama Krishnam Raju: ప్ర‌భుత్వం స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డిపై వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్య‌క్తం చేశాడు. సజ్జల ఉద్యోగులను విభజించి పాలిస్తున్నాడనీ, ఉద్యోగుల్లో వర్గ రాజకీయాలను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. 

MP Raghu Rama Krishnam Raju: ప్ర‌భుత్వం స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డిపై వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్య‌క్తం చేశాడు. సజ్జల ఉద్యోగులను విభజించి పాలిస్తున్నాడనీ, ఉద్యోగుల్లో వర్గ రాజకీయాలను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. ఆయ‌న .. కనీసం ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు..కానీ, సజ్జల ... అన్నీ తానై అన్న‌ట్టు వ్యవహరిస్తున్నార‌నీ, వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులపై పెత్తనం చేస్తున్నాడని ఆరోపించారు. సజ్జల తన పరిధికి మించి వ్యవహరిస్తుండటంపై మా పార్టీలో ప్రజాప్రతినిధులు సైతం అసహ్యించుకుంటున్నార‌ని రఘురామకృష్ణరాజు అన్నారు. 

ఎంపీ రఘురామకృష్ణరాజు విలేకర్ల స‌మావేశంలో మాట్లాడుతూ..సజ్జల వైఖరిని తీవ్రస్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న వ్య‌వ‌హ‌ర తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సజ్జలకు ఉద్యోగ సంఘాలను బెదిరించే హక్కు ఎక్కడిదని ప్ర‌శ్నించారు. ‘నేనున్నాను... నేను వింటాను’ అని అన్న ముఖ్యమంత్రి... ‘సజ్జల ఉన్నాడు... సజ్జల వింటాడు... సజ్జల చేస్తాడు’ అని ఏనాడూ చెప్పలేదని అన్నారు. ఆయ‌న‌ సకల పాత్రాభినయంపై కోర్టులో వేసిన కేసు ఇప్పటికీ విచారణకు రావడం లేదన్న‌ద‌ని విమ‌ర్శించారు.

ఉద్యోగులు త‌మ న్యాయమైన కోర్కెల సాధన కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే.. వారిలో ఎందుకు అశాంతిని సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాల నాయకులతో చ‌ర్చ‌లు జరపాల్సిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని, ‘ఎం ధర్మరాజు’ చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో సినీ హీరో మోహన్‌బాబు మరోసారి రిలీజ్‌ చేస్తే బాగుంటుందని వ్యంగ్యంగా అన్నారు.

ఎన్టీఆర్ గారి మీద నిజంగానే ప్రేమ ఉంటే.. గత ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు మీద నిర్వహించిన ‘అన్న క్యాంటీన్ల‘ను ఎందుకు మూసివేశారని నిల‌దీశారు. ప్రతి పథకానికీ వైఎస్సార్‌, జగనన్న పేర్లు పెట్టే బదులు.. కనీసం ఓ పథకానికైనా ఎన్టీఆర్‌ పేరు పెట్టొచ్చుకదా! అని నిలదీశారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినంత మాత్రాన, ఆ సామాజిక వర్గం ఓట్లు వచ్చేస్తాయా? అని ప్రశ్నించారు. 

కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అసెంబ్లీలో విస్తృతంగా చర్చించకుండా సీఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా టార్గెట్ చేశారు. విజ‌య సాయి రెడ్డి.. మతసామరస్యంపై నీతులు బోధించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంద‌ని అన్నారు. జాతీయ జెండాలోని రంగులను విజయసాయిరెడ్డి తప్పుగా అర్థం చేసుకోవడం దుర‌దృష్ట‌క‌ర‌మని రఘురామరాజు వ్యాఖ్యానించారు.