‘కేంద్రం మరోసారి మోసం చేసింది’

mp kesineni nani fires on central government
Highlights

ఎంపీ కేశినేని నాని

కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రానికి హోదా విషయంలో కేంద్రం మోసం చేయగా.. ఇప్పుడు ఉక్కు పరిశ్రమ విషయంలోనూ ఇదే విధంగా ప్రవర్తించిందన్నారు.

మెకాన్ సర్వేలో ఉక్కు ఫ్యాక్టరీపై సానుకూలత వ్యక్తమైనా.. అఫిడవిట్ ద్వారా కేంద్రం దుర్బుద్ధిని చూపించిందని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాష్ట్రం పట్ల ప్రేమ ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని తేలిందని నాని అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం కడపలో జరిగే దీక్షల్లో టీడీపీ ఎంపీలతో పాటు వైసీపీ ఎంపీలు కూడా పాల్గొనాలని కేశినేని నాని పిలుపు ఇచ్చారు.
 

loader