ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు విమర్శించారు. ఏపీలో శాంతిభద్రతలు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు విమర్శించారు. ఏపీలో శాంతిభద్రతలు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అదుపు తప్పాయని విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై పూర్తి రిపోర్ట్ ఉందని తెలిపారు. విశాఖపట్నం ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ ఘటనలో పూర్తి నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వాలు భూదందాలపై వేసిన సిట్ రిపోర్టు ఎందుకు బయటపెట్టలేదని జీవీఎల్ నర్సింహారావు ప్రశ్నించారు. ఆ రిపోర్ట్‌ ఆధారంగానే ముఖ్యమంత్రి భూ సెటిల్మెంట్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఆ రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లాలో పదో తరగతి బాలుడి పెట్రోలో పోసి నిప్పటించి హత్య చేయడం దారుణమని అన్నారు. వైసీపీ కార్యకర్తలది రాక్షస మనస్తత్వం అని విమర్శించారు. బాపట్ల జిల్లాలో దారుణ హత్యకు గురైన బాలుడి కుటుంబానికి సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఏపీలో ఇసుక, మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని జీవీఎల్ నర్సింహారావు కోరారు. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయం జరుగుతుందని విమర్శించారు.