వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. బుట్టా రేణుక

MP butta renuka about next elections
Highlights

వచ్చే ఎన్నికలపై తేల్చి చెప్పిన బుట్టా

వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీచేయడం లేదని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. 2019 ఎన్నికల్లో మళ్లీ కర్నూలు ఎంపీగానే పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈసారి మాత్రం టీడీపీ తరుపున కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు వచ్చిన వార్తలను ఆమె కొట్టి పారేశారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం నుంచి తాను పోటీ చేయట్లేదని తెలియజేశారు.

ఎమ్మిగనూరులో రూ.9.78లక్షలతో నిర్మించిన నీటి ట్యాంక్‌ను బుట్టా రేణుక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో బుట్టా రేణుక వైసీపీ నుంచి కర్నూలు ఎంపీగా గెలిచారు. అనంతరం ఆమె టీడీపీలో చేరారు.

loader