చంద్రబాబు ఓటమే నా లక్ష్యం.. మోత్కుపల్లి

motkupalli again sensational comments on chandrababu
Highlights

ఎన్టీఆర్ దయతో తాను రాజకీయాల్లోకి వచ్చానని.. పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తుంటే.. చంద్రబాబు నడి బజార్లో తన గొంతు కోశేశారని.. మానసికంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆయన తిరుపతి చేరుకున్నారు. కాలినడకన కొండ ఎక్కి స్వామిని దర్శించుకోనున్నారు.

ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ఓటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ దయతో తాను రాజకీయాల్లోకి వచ్చానని.. పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తుంటే.. చంద్రబాబు నడి బజార్లో తన గొంతు కోశేశారని.. మానసికంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాజకీయాల్లో సేవ చేసేవాళ్లు ఉండాలి కాని.. దుర్మార్గులు కాదన్నారు మోత్కుపల్లి. చంద్రబాబు నమ్మక ద్రోహని.. రాష్ట్రంలో పేదలను అణగదొక్కేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీకి శనిలా మారారని.. ఆయన తిరిగి అధికారంలోకి రాకుండా.. వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలన్నారు. తనను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా.. అవన్నీ లెక్క చేయకుండా కాలినడక వెంకన్నను దర్శించుకొని చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటానని చెప్పారు మోత్కుపల్లి. 

loader