కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కన్న బిడ్డలకు నిప్పంటించి తాను ఆత్మహత్యకు ప్రయత్నించింది ఓ తల్లీ. వివరాల్లోకి వెళ్తే ఎమ్మిగనూరు మండలం మసీదు పురంలో పద్మావతి అనే మహిళ భర్తతో కలిసి జీవిస్తోంది. 

అయితే భార్య భర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో అవి కాస్త మంగళవారం పెద్ద వివాదానికి దారి తీశాయి. దాంతో సహనం కోల్పోయిన పద్మావతి తన ఇద్దరు పిల్లలకు కిరోసిన్ పోసి నిప్పటించింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  

విషయం గమనించిన స్థానికులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా దారుణం వెలుగుచూసింది. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.