ఓ దేవాలయంలో రెండు రోజుల కిందట పంచిపెట్టిన ప్రసాదం తినడంతో 50 మంది ఇబ్బందులకు గురయ్యారు. వారంతా విరేచనాలతో బాధపడ్డారు. వెంటనే ఆ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఘటన తిరుపతిలోని కేవీబీపురంలో జరిగింది.

ఆలయంలోని ప్రసాదం తిని 50 మందికి పైగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వారంతా విరేచనాలు చేసుకున్నారు. ప్రస్తుతం బాధితులు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోని కేవీబిపురంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 

సబ్ ఇన్‌స్పెక్టర్‌ ను కట్టేసి.. గుడ్డలూడదీసి.. ఆపై దాడి.. అసలేం జరిగిందంటే?

కేవీబీపురం మండలం అరె గ్రామంలో ఓ దేవాలయం ఉంది. ఆ ఆలయ నిర్వాహకులు గ్రామంలో రెండు రోజుల కిందట భక్తులకు ప్రసాదం పంచిపెట్టారు. అయితే ఆ ప్రసాదం తిన్న కొంత సమయం తరువాత 50 మందికి పైగా విరేచనాలతో బాధపడ్డారు. ఈ విషయం తెలిపిన వెంటనే అక్కడ స్థానిక వైద్యాధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడ పలువురికి చికిత్స కొనసాగుతోంది. అలాగే 30 మంది బాధితులు కేవీబీపురం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

'నా కలలోకి శ్రీ రాముడు వచ్చి..' : 'సైనైడ్' వ్యాఖ్య తర్వాత బీహార్ మంత్రి మరో వివాదాస్పద వాదన..