ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. దాడి జరిగిన వెంటనే విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లిన జగన్ అక్కడ ఓ హాస్పిటల్ లో చికిత్స పొందారు. తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. దాడి జరిగి పది రోజులు గడుస్తున్నా... గాయం పూర్తిగా నయం కాలేదు. కానీ.. జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగించాలనుకుంటున్నారు.

మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నప్పటికీ.. పాదయాత్ర కొనసాగిస్తానని జగన్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  శనివారం నుంచి జరిగే జగన్ పాదయాత్రకు భద్రత మరింత పెంచనున్నట్లు తెలిపారు. జగన్ పై జరిగిన దాడి కేసులో విచారణ కొనసాగుతోందని వివరించారు.

ఈ ఘటనలో స్టేట్ మెంట్ ఇవ్వాల్సిందిగా ఇప్పటికి రెండు సార్లు జగన్ ని కోరామని కానీ ఆయన అందుకు అంగీకరించలేదని తెలిపారు. మరోసారి ఆయనను కోరతామని చెప్పారు. జగన్ స్టేట్ మెంట్ ఇస్తే విచారణ సులువవుతుందని ఆయన పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపు విచారణ అధికారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.

 

మరిన్ని వార్తలు..

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్