ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. దీంతో ఉద్యోగుల జీతాలు, ఇతర ఆర్ధిక బిల్లుల చెల్లింపునకు అడ్డంకులు తొలగిపోయాయి.

ప్రభుత్వ ఖర్చులకు సైతం సాంకేతిక పరమైన అడ్డంకి తొలగింది. ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించకపోవడంతో.. నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం ఎలాంటి ఖర్చు చేయకూడదు.

Also Read:ఉద్యోగులకు జీతాలు రాకపోవడానికి టీడీపీయే కారణం: ఏపీ ఎన్‌జీవో అధ్యక్షుడు

ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునే వెసులుబాటు ఉండదు. దీనిని ఫైనాన్షియల్ షట్ డౌన్ అంటారు. ఇవాళ్టీ నుంచి బిల్లు ఆమోదం పొందే వరకు ఒక్క రూపాయి కూడా వినియోగించుకునే అవకాశం వుండదు.

శనివారం నాటికి సాంకేతిక ఇబ్బందులు తొలగి.. గవర్నర్ సంతకం చేస్తే, నిధులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే బుధవారం నుంచి శనివారం వరకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేని పరిస్థితి.

Also Read:రణరంగంగా మారిన కౌన్సిల్... ద్రవ్యవినిమయ బిల్లుకు దక్కని ఆమోదం

నిన్నటి వరకు ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసింది. అయితే 14 రోజుల్లోగా మనీ బిల్లును మండలి ఆమోదించకపోతే, గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది