చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని నగరి సమీపంలో సినీ ఫక్కీలో సెల్ ఫోన్ల లారీని దొంగల ముఠా దోచుకొంది. లారీ డ్రైవర్ ను బెదిరించి ఫోన్లను దోచుకెళ్లారు దొంగలు. ఈ ఘటనపై లారీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబూరులో ఉన్న ఎంఐ సెల్ ఫోన్ల కంపెనీ నుండి సెల్ ఫోన్లను లోడ్ చేసుకొని వెళ్తున్న లారీని ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో దొంగల లారీ వెనుక నుండి ఢీకొట్టింది. సెల్ ఫోన్ల లారీని నగరికి సమీపంలోకి తీసుకెళ్లి మరో లారీలోకి సెల్ ఫోన్లను లోడ్ చేశారు.  సినీ ఫక్కీలో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

8 వేల సెల్ ఫోన్లను మరో లారీలోకి మార్చుకొన్నారు. ఈ లారీలో సుమారు 16 వేల సెల్ ఫోన్లు ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. దోపీడీకి గురైన సెల్ ఫోన్ల విలువ సుమారు 12 కోట్లు ఉంటుందని అంచనా. దోపీడీకి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

మరో లారీలో సెల్ ఫోన్లను తీసుకొని దొంగలు పారిపోయారు.సెల్ ఫోన్ల లారీని నగరికి సమీపంలో నిందితులు వదిలివెళ్లిపోయారు. తనను తుపాకీతో బెదిరించినట్టుగా సెల్ ఫోన్ల లారీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.