ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సెటైర్లు వేశారు. కరోనా పెద్ద విషయం కాదని.. పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుందంటూ ఇటీవల జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై బుద్ధా ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

Also Read కరోనా పై పోరాటం... బాలకృష్ణ భారీ విరాళం...

కరోనా పెద్ద విషయం కాదని.. జ్వరం లాంటిదేనని నాడు సీఎం జగన్ అన్నారని ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ చల్లితే పోయేలా అయితే జగన్ బయటకు వచ్చి ముద్దులెందుకు పెట్టడం లేదంటూ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.

 

‘‘కరోనా పెద్ద విషయం కాదు జ్వరం లాంటిదే అన్నారు జగన్ గారు. పారాసిట్మాల్ వేసుకుంటే తగ్గిపోతుంది.. బ్లీచింగ్ వేస్తే తగ్గిపోతుందని సెలవిచ్చారు. ఒకవేళ అదే నిజం అయితే జగన్ గారు బయటకి వచ్చి అవ్వా, తాతలకు పాదయాత్రలో మాదిరిగా ముద్దులు ఎందుకు పెట్టడం లేదు.. ఓదార్పు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు తాడేపల్లి ఇంటిలో దాక్కున్నారు? కరోనా వచ్చి వృద్దులు పోయినా పర్వాలేదు పెన్షన్ డబ్బులు మిగులుతాయి అనుకునే క్రూరమైన మనస్తత్వం జగన్ గారిది’’ అని బుద్దా వెంకన్న ట్వీట్‌లో పేర్కొన్నారు