గన్నవరానికి నేనే ఇన్‌ఛార్జ్‌ని అన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ విషయం గతంలోనే ముఖ్యమంత్రి జగన్ చెప్పారని ఆయన వెల్లడించారు. కాకులపాడు ఘటనలో నా పాత్ర లేదని.. ఇద్దరు దాడి చేసుకునేందుకు యత్నించే క్రమంలో తాను నెట్టానని వంశీ వెల్లడించారు.

వీడియో ఎడిట్ చేసి రిలీజ్ చేశారని ఆయన ఆరోపించారు. మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. గన్నవరంలో పంచాయితీలు ఏమీ లేవని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో వైసీపీ జెండానే ఎగురుతుందని నాని పేర్కొన్నారు. 

గన్నవరం వైసీపీలో నెలకొన్న వర్గపోరుకు చెక్‌ పెట్టేందుకు పార్టీ అధినేత, సీఎం జగన్‌ ఇవాళ ఓ ప్రయత్నం చేశారు. గన్నవరంలోని పునాదిపాడు పాఠశాలకు విద్యాకానుక కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరైన జగన్.. వంశీ, యార్గగడ్డ ఇద్దరినీ పలుకరించారు.

ఇద్దరినీ పరస్పరం షేక్‌ హ్యాండ్‌ ఇప్పించారు. విభేదాలు వీడి పార్టీ కోసం పనిచేయాలని ఇద్దరినీ కోరారు. జగన్‌ సమక్షంలోనే వంశీ, యార్గగడ్డ షేక్ హ్యాండ్‌ ఇచ్చుకోవడంతో కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే మరో నేత దుట్టా రామచంద్ర రావు మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు.