వైసీపీ నేతలు ఏ స్ధాయిలో ఉన్నా ఏ విషయంలో కూడా వారి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ తమ హెచ్చరికలను పట్టించుకోకపోతే వారిపై చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించటంపై జిల్లాలోని అదికార యాంత్రాంగంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్న సామెత ఊరకే రాలేదు. మొన్నటి నంద్యాల పర్యటనలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తానిచ్చే ఫించన్ తీసుకుంటూ, తానిచ్చే రేషన్ తీసుకుంటూ తనకు ఓట్లేయరా? అంటూ జనాలను గద్దించిన విషయం తెలిసిందే కదా? అంతేకాకుండా తన ప్రభుత్వం అంటే ఇష్టంలేని వారు తానేస్తున్న రోడ్లపై తిరగవద్దు, తానిస్తున్న రేషన్ తీసుకోవద్దు, ఫించన్ కూడా తీసుకునేందుకు లేదంటూ మండిపడ్డారు గుర్తుందా? సరే, అది ముగిసిన కథ.
చంద్రబాబును స్పూర్తిగా తీసుకున్నారు ఓ ఎంఎల్ఏ. అదికూడా చిత్తూరు జిల్లాలోనే సుమా. సత్యవేడు టిడిపి ఎంఎల్ఏ తలారి ఆదిత్య పార్టీ సమావేశంలో అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, తాము చెప్పిన పనులు చేయదలచుకోని అధికారులు నియొజకవర్గం నుండి వెళ్లిపోవాలని హూంకరించారు. ఏ పనైనా సరే తాము చెప్పినవే చేయాలని హెచ్చరించారు.
ప్రతిపక్ష వైసీపీ ప్రజాప్రతినిధుల మాటలు వినాల్సిన అవసరం లేదని నేరుగానే చెప్పేసారు. అంతేకాదు, వైసీపీ నేతలు ఏ స్ధాయిలో ఉన్నా ఏ విషయంలో కూడా వారి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ తమ హెచ్చరికలను పట్టించుకోకపోతే వారిపై చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించటంపై జిల్లాలోని అదికార యాంత్రాంగంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
