టీటీడీకి ఆ హక్కు ఎక్కడిదంటున్న ఎమ్మెల్యే రోజా

MLA roja fire on ttd palaka mandali
Highlights

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రమణ దీక్షితులు చెబుతున్న విషయాలు నిజమేమోనని అనిపిస్తోందన్నారు. 

నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా.. టీటీడీ( తిరుమల తిరుపతి దేవస్థానం) పై మండిపడ్డారు. సోమవారం ఉదయం తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకున్న ఆమె.. ఆలయ మూసివేతపై టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.

మహా సంప్రోక్షణ పేరుతో 9రోజులు ఆలయాన్ని మూసివేసే హక్కు టీటీడీకి లేదన్నారు. తొమ్మిది రోజుల పాటూ ఆలయానికి ఎవర్నీ రావొద్దని పాలకమండలి ఎలా చెబుతుందని ప్రశ్నించారు. పుట్టా సుధాకర్ యాదవ్ ఛైర్మన్ అయ్యాక ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు ఎక్కువగా తీసుకొంటున్నారని.. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రమణ దీక్షితులు చెబుతున్న విషయాలు నిజమేమోనని అనిపిస్తోందన్నారు. 


తిరుమలలో పరిణామాలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిల్ వేసేందుకు సిద్ధమయ్యారని.. అందుకే హడావిడిగా పాలకమండలి సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆరోపించారు. . మహా సంప్రోక్షణ జరిగే సమయంలో సీసీ కెమెరాలు ఆపేస్తామని చెబుతున్నారని.. ఇదంతా చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. టీటీడీ ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని లేని పక్షంలో శ్రీవారి భక్తులతో కలిసి నిరసన చేపడతామని రోజా హెచ్చరించారు. 

loader