నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి అదరగొట్టారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 108 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన సమయంలో.. రోజా అంబులెన్స్ నడిపి అందరికీ షాకిచ్చారు. కాగా.. తాజాగా.. ఇప్పుడు ఆమె బైక్ నడిపారు. అది మామూలు బైక్ కాదు.. బైక్ అంబులెన్స్. డ్రైవర్లకు ధీటుగా ఆమె బైక్ నడిపిన తీరికి ఇప్పుడు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... నగరి ఎమ్మెల్యే రోజా కోరిక మేరకు శ్రీ సిటీ హీరో మోటార్స్ కంపెనీ రెండు బైక్ అంబులెన్స్ వాహనాలను అందించింది. వాటిని నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే రోజా తన చేతుల మీదుగా ఆదివారం నాడు ప్రారంభించారు. నగరి, పుత్తూరు ప్రభుత్వాసుపత్రులకు చెరొకటి అందజేయనున్నారు. ఈ క్రమంలో బైక్ అంబులెన్స్‌లను నడిపి రోజా సందడి చేశారు.  కాగా.. ఆమె బైక్ నడిపిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఈ కార్యక్రమంలో నగరి పుత్తూరు మెడికల్ ఆఫీసర్లు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు పట్టణ ముఖ్య నాయకులు శ్రీ సిటీ హీరో మోటార్స్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.