అనంతపురం:  ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  రాచరికపు పోకడలతో వ్యవహరిస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విమర్శించారు. తాను కూడ ఎంపీకి ఎదురుతిరుగగలనని ఆయన హెచ్చరించారు.

సోమవారం నాడు ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. జేసీ దివాకర్ రెడ్డి తన సొమ్ముతో బ్రిడ్జిని నిర్మించారా అని ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించకుండా జేసీ దివాకర్ రెడ్డి  బ్రిడ్జిని ప్రారంభించడాన్ని ఎమ్మెల్యే తప్పుబట్టారు. అధికారుల మాటలకు తలొగ్గి తాను వెనక్కి తగ్గినట్టుగా  ఆయన  గుర్తు చేశారు.

జేసీ దివాకర్ రెడ్డి తీరుపై తాను అధిష్టానానికి ఫిర్యాదు చేయబోనని చెప్పారు. జేసీ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని మానుకోవాలని ప్రభాకర్ చౌదరి హితవు పలికారు.

సంబంధిత వార్తలు

జేసీ వర్సెస్ ప్రభాకర్ చౌదరి: అర్ధాంతరంగా వెళ్లిపోయిన ఎమ్మెల్యే