అనంతపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య నెలకొన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం నాడు రాం నగర్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఈ కార్యక్రమం నుండి  అర్ధాంతరంగానే వెళ్లిపోయారు.

అనంతపురం జేసీ దివాకర్ దివాకర్ సోమవారం నాడు రాంనగర్ బ్రిడ్జిని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి  స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్‌కు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కొంతకాలంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి,  ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తనకు వ్యతిరేకంగా జేసీ దివాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. 

అయితే ఇవాళ రాంనగర్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో కూడ జేసీ వ్యవహరించిన తీరుతో ప్రభాకర్ చౌదరి అర్ధారంతరంగా కార్యక్రమం నుండి  వెను తిరిగారు.రాంనగర్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.