ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న రీతిలో నిరసనకు దిగాడు. డ్రైనైజీ సమస్యను ఎన్నిసార్లు చెప్పినా..  రైల్వే, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మురుగునీటి గుంటలోకి దిగి నిరసన తెలిపారు.  

నెల్లూరు : రైల్వే, మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే Kotamreddy Sridhar Reddy మురుగునీటి కాలువలోకి దిగారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోంది అని కోటంరెడ్డి తెలిపారు. ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉందని, దీని మీద ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు ప్రశ్నించానని అన్నారు. రైల్వే, కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకున్నారని వెల్లడించారు.

తాను అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి కూడా.. అధికారులతో మాట్లాడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారమా? ప్రతిపక్షమా? అనేది ఉండదని.. ప్రజల పక్షమే ఉంటుందని అన్నారు. తాను ఆ పక్షమే ఉంటానని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తాను కూడా బాధపడుతున్నానని అన్నారు. రైల్వే అధికారుల మొండి తీరు, కార్పొరేషన్ అధికారులు నత్తనడకని ప్రశ్నిస్తూ మురుగు గుంతలోకి దిగుతున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. 

మచిలీపట్నంలో విషాదం... సముద్రంలో నలుగురు మత్స్యకారులు గల్లంతు