విజయవాడ: చెవిటికల్లు గ్రామస్తులపై ఎమ్మెల్యే జగన్మోహన్ శనివారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కాకుండా హోం మంత్రికి ఎందుకు ఫోన్ చేశారని ఆయన మండిపడ్డారు. ఈ విషయమై గ్రామస్థులతో ఆయన వాగ్వాదానికి కూడ దిగారు. గ్రామస్తులు కూడ ఎమ్మెల్యేతో  గోడవ పెట్టుకొన్నారు.

శుక్రవారం నాడు సాయంత్రం  పడవలో గ్రామం దాటుతున్న సమయంలో పరిమితిని మించి పడవ ఎక్కిన కారణంగా  పడవ నుండి  బాలిక నీటిలో కొట్టుకుపోయింది. శనివారం నాడు ఉదయం శివాలయం సమీపంలో బాలిక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.

చెవిటికల్లులో శనివారం నాడు ఎమ్మెల్యే జగన్మోహన్ పర్యటించారు. గ్రామస్తులతో ఆయన వాగ్వాదానికి దిగారు.తనకు కాకుండా హోంమంత్రికి ఎందుకు ఫోన్ చేశారని ఆయన ప్రశ్నించారు. 

హోం మంత్రి వచ్చి మీ సమస్యలు తీరుస్తారా ఆయన మండిపడ్డారు. మీరు చదువుకొన్నారా... చదువుకొంటే ఇలా చేసేవారు కాదు అంటూ గ్రామస్తులను అడిగారు. గ్రామస్తులు కూడ ధీటుగానే సమాధానం చెప్పారు.

చదువుకోకపోతే మాట్లాడకూడదా అని ఎమ్మెల్యేపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోకి వరద నీరు రావడంతో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. గ్రామానికి చెందిన బాలిక నీళ్లలో కొట్టుకొపోయిన విషయమై హోంమంత్రికి సమాచారం ఇచ్చినట్టుగా మరికొందరు గ్రామస్తులు చెప్పారు.
 

సంబంధిత వార్తలు

కృష్ణమ్మ ఉగ్రరూపం, నాటు పడవ బోల్తా: 11ఏళ్ల బాలిక గల్లంతు

పోటెత్తిన వరద: లంక గ్రామాల్లోకి నీరు, అప్రమత్తమైన సర్కార్