ప్రభుత్వం మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వటంతో రాజధాని ప్రాంత చిన్న రైతులతో   పోలంలో పని చేస్తూ ఎమ్మెల్యే నిరసన

ఈ రోజు ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం రాజధాని పరిసర గ్రామాలలో భూసేకరణ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా రైతులు వినూత్న పద్దతిలో నిరసన తెలిపారు. రాజధాని ప్రాంత రైతుల హక్కులకు మద్ధతుగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. పెనుమాక గ్రామంలోని రైతులతో వ్యవసాయ పనులలో పాల్గొని ఆళ్ల. రామకృష్ణా రెడ్డి సంఘీభావం తెలిపారు.

ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వటంతో రాజధాని గ్రామంలో చిన్న రైతులు కూలీలు పోలంలో పని చేస్తూనే నిరసన చెప్పాల్సి వస్తున్నదని ఆయన అన్నారు.

ఇప్పటికే ప్రభుత్వం రైతుల దగ్గర నుండి వేలాది ఎకరాలు సేకరించింది. మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వటం ఎందుకు? ఇది దారుణమని, రైతుల భూములు కాజేసే చర్య అని అందుకే నేను రైతులతో కలసి నిరసన ఈ విదంగా తెలిజెస్తున్నానని ఆళ్ల అన్నారు.