టీడీపీ మహిళా ఎమ్మెల్యే పై సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు అసభ్య కామెంట్స్ చేశారు. దీంతో సదరు ఎమ్మెల్యే దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ని కించపరుస్తూ... సోషల్ మీడియాలో కొందరు అసభ్యంగా కామెంట్స్ పెట్టారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన పట్ల అసభ్యకర కామెంట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Also Read నేడు అమరావతి రైతులు, రేపు విశాఖ రైతులా...? జగన్ పై లోకేష్ విమర్శలు...

ఎమ్మెల్యే భవానికి మద్దతుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, మహిళా కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భవానీ మాట్లాడుతూ... అసెంబ్లీలో మద్యం అంశంపై మాట్లాడినందుకు తనపై అసభ్యకరంగా కామెంట్స్ చేశారన్నారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసి రెండు నెలలైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దిశ పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే ఇంకా చట్టం అమల్లోకి రాలేదని అంటున్నారని...దిశ పీఎస్‌ ప్రారంభం పేరుతో సీఎం అబద్ధపు ప్రచారం చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.