అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ మతంలోకి మారిన కొందరు షెడ్యూల్డు కులా వారికోసం కేటాయించిన రేజర్వేషన్లను ఉపయోగించుకుంటూ వారి హక్కులను కాలరాస్తున్నారని జాతీయ ఎస్సి కమిషన్ కి ఫిర్యాదు చేసారు.

లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అనే సంస్థ అధ్యక్షుడైన సంతోష్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేసారు. ఇదే విషయమై బీసీ కమిషన్ కి కూడా మరో ఫిర్యాదు చేసారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1971 వరకు క్రైస్తవుల సంఖ్య చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉండగా... 2011కొంచెం సరికి మాత్రం గణనీయంగా పడిపోయింది. 1971లో 4.19% ఉన్న క్రైస్తవులు 2011 వచ్చేనాటికి 1.34% పడిపోయారు.

Also read: దళిత క్రిస్టియన్ వివాదం: చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

దీనికి ముఖ్యంగా రెండు కారణాలుండొచ్చు. ఒకటి, క్రైస్తవ మతం పుచ్చుకున్నవారు తిరిగి తమ పాత మతాన్నీ తిరిగి స్వీకరించడమే, లేదా క్రైస్తవ మతాన్ని వదిలివేయడమో చేయాలి. రెండు, వారు జనాభా లెక్కల అధికారుల వద్ద నిజాన్ని దాచిపెడుతూ ఉండవచ్చు. 

పరిస్థితులను చూస్తుంటే రెండవ వాదనే నిజంగా కనబడుతుందని ఫిర్యాదు దారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దానికి లెక్కలను కూడా జత చేసాడు. రాష్ట్రంలో 1971 తరువాత ఎస్సి జనాభా క్రమేపి పెరగగా...క్రిస్టియన్ జనాభా గణనీయంగా పడిపోతూ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే క్రిస్టియన్ జనాభా, ఎస్సి జనాభాను కలిపితే మాత్రం రెండు కూడా 1971లో ఎంత ఉన్నాయి... 1లో కూడా దాదాపుగా అంతే ఉన్నాయి. 

ఇలా అంతర్గతంగా మతం మార్చుకొని కొనసాగుతున్నవారు బయటకు మాత్రం తాము మతం మార్చుకోలేదని చెబుతున్నారు. ఇలా వారు చేయడాన్ని ప్రభుత్వం కూడా సమర్థిస్తూ... ఎస్సిలుగా అధికారిక పుస్తకాల్లో కొనసాగుతూ క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నవారికి కొమ్ము కాస్తుందని సదరు వ్యక్తి ఆరోపిస్తూ ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాధానాలను పొందుపరిచారు. 

గత సంవత్సరం జగన్ అధికారం లోకి వచ్చాక, గత చంద్రబాబు హయాంలోని చంద్రన్న క్రిస్మస్ కానుకను కొనసాగించారు. ఈ కనుక కింద లబ్ధిదారులను ఎలా సెలెక్ట్ చేసారు అని సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా, తెల్ల రేషన్ కార్డు కలిగిన ఎస్సిలనందరినీ ఎంపిక చేసినట్టు తెలిపారు.

ఇలా ఎస్సిలను క్రైస్తవులుగా పరిగణించడం ఇటు హిందూ సామజిక వర్గానికి, క్రైస్తవ సామాజిక వర్గానికి ఇద్దరికి ద్రోహం చేసినట్టే అని సదరు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. 

Also read: కేంద్రం చూస్తూ ఊరుకోదు: అమరావతిపై జగన్ సుజనా హెచ్చరిక

మతమార్పిడులను గుర్తించేందుకు, నమోదు చేసేందుకు సరిఅయిన వ్యవస్థ లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని, ఇలా భారీస్థాయిలో మతమార్పిడులను ప్రభుత్వమే దగ్గరుండి ప్రోత్సహిస్తుందని వారు ఆరోపించారు. దీనిపైన నిజనిర్ధారణ కమిటీని తక్షణం నియమించి వాస్తవాలేంటో బయటకు తెలియపరచాలని ఆయన కోరారు. 

ఇలా క్రైస్తవ మతంలోకి మారుతున్నవారిలో అత్యధికులు ఎస్సిలని, ఇలా మతం మార్చుకున్న వారు ఎస్సి లుగా పరిగణింపరాదు. వారు షెడ్యూల్డ్ కులస్థులుగా పరిగణింపబడరు. అందువల్ల వారు మతం మార్చుకున్నప్పటికీ, వారు ఆ విషయాన్నీ మాత్రం బయటకు చెప్పకుండా రిజర్వేషన్ వల్ల వచ్చే అన్ని రకాల ప్రయోజనాలను అనుభవిస్తున్నారని, ఇది ఎస్సిల హక్కులను కాలరాయడమేనని ఆయన అభిప్రాయపడ్డాడు.